Health Tips : శరీరంలోని ఆరోగ్య వ్యవస్థల పనితీరు మొత్తము హార్మోన్ల సంతులనం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి హార్మోన్లను సంతులనంగా ఉంచే ఆహారాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా హార్మోన్ల సమస్య అనేది స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ హార్మోన్ల సమస్య వలన పీరియడ్స్ ప్రతి నెల సరిగా రాకపోవడం, శరీర బరువు పెరగడం, రక్తహీనత, క్యాల్షియం తగ్గడం చూస్తూ ఉంటాము. ఇవన్నీ హార్మోన్ల సమతుల్యంగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి ఏ ఆహారం తీసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా…
▪️క్రూసి ఫెరాస్ కూరగాయలు: కాలీఫ్లవర్, బ్రోకోలి, ఆవాలు, గోధుమ రంగు కూరగాయలు, తెల్ల ఆవాలు, చైనీస్ క్యాబేజీ ,ఇవన్నీ క్రూసి ఫెరాస్ జాతికి చెందిన కూరగాయలు. వీటిలో కొన్నిటిని రోజుకో కప్పు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
▪️అవిసె గింజలు: ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని స్మూదీలలో, సాలాడ్లు, పెరుగులో కలిపి తీసుకోవాలి.
▪️చేదు: కాకరకాయ కూర లేదా వేపుడు ప్రతి రోజు భోజనంలో ఒక టేబుల్ స్పూన్ ఉండేలాగా చూసుకోవాలి.
▪️గుడ్లు: ఉదయము అల్పాహారంలో భాగంగా గుడ్డును తీసుకోవడం మంచిది.
▪️కొబ్బరి నూనె: వంటకాల్లో కొబ్బరి నూనె వాడుకోవాలి. దీనివల్ల అధిక బరువు పెరగరు పైగా మన శరీరానికి హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె ఎంతో మేలు చేస్తుంది.
▪️చేపలు: క్రవ్వుతో కూడిన చేపలు వారంలో కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. కొన్ని చేపల్లో ఉండే క్రోవులు మన శరీరానికి మేలు చేస్తాయి అని వైద్యులు సూచిస్తున్నారు.