Health Tips : సాధారణంగా ప్రస్తుత కాలంలో చెప్పులు, షూలు అని ఏవో ఒకటి వేసుకుంటూనే ఉంటాము. కానీ ఇంటి నుంచి కాలు బయటకు పెడితే చాలు కాళ్లకు దుమ్ము, దూళి అంటుకుని పాడవుతాయేమో అని అనుకుంటారు. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటూ ఉంటారు. మన పెద్దవాళ్లు పొలంలో చేసినా, ఏదైనా పనులుకు బయటకు వెళ్లినా… చెప్పులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లు కాదు. వాళ్లు ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా ఎన్నో ఏళ్లు హ్యాపీగా జీవించేవాళ్లు. రోజులో కొంచెం సేపైనా చెప్పులు లేకుండా నడిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం 20 నిమిషాల పాటు ఉట్టి కాళ్లతో నడిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మన పాదాల్లో 72 వేల నరాల కొసలు ఉంటాయి. ఎక్కువ సేపు షూ వాడడం వల్ల సున్నితమైన ఈ నరాలు మందగిస్తాయి.
రోజంతా బూట్లు వేసుకుని ఉండటం శరీరంలోని సహజ బయోమెకానిక్స్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది.
బాడీ మొత్తంలో ఉండే ఎముకల్లో 25 శాతం పాదాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. షూ వాటిని సహజంగా కదలకుండా అడ్డుకుంటాయి.
దీని వల్ల మోకాళ్లు, నడుము నొప్పి వంటి సమస్యలు వేధిస్తాయి.
ఈ మధ్య కాలంలో నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. చెప్పులు లేకుండా ఉత్తి కాళ్లతో నడిస్తే బాడీ రిలాక్స్ అవుతుంది.
చెప్పులు లేకుండా నడిస్తే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉత్తి కాళ్లతో నడిస్తే కాళ్ల కండరాలు స్ట్రాంగ్ అవుతాయి.
పాదాలు, కాళ్లు , కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పుల్లేకుండా నడవాలి.
ఎక్కువగా షూ వేసుకుంటే పాదాల కండరాల మధ్య ఉండే న్యాచురల్ లింక్ దెబ్బతింటుంది.
కండరాలు సరిగా పనిచేయకపోతే లిగ్మెంట్స్ మీద, ఎముకల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.
చెప్పుల్లేకుండా నడిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఉత్తి కాళ్లతో నడిస్తే కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
కంటి సమస్యలు నుంచి రక్షణ లభిస్తుంది. మీరు ప్రతిరోజు కొంతసేపైనా చెప్పులు లేకుండా నడటం అలవాటు చేసుకోండి.