Health Tips : ఈరోజుల్లో మేకప్ వాడని వారంటూ ఎక్కువగా ఉండరేమో. అందరూ మేకప్ అనేది సహజంగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ ఇంకా సినీ తారలైతే చెప్పనక్కర్లేదు. అయితే అసలు ఈ మేకప్ ఎన్ని రకాలు ఉంటుంది. ఏ మేకప్ వేసుకుంటే ఫేస్ కి సూట్ అవుతుంది అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా…
లిక్విడ్ మేకప్: వయస్సు పైబడే వారిలోనూ అదే విధంగా డ్రై స్కిన్ వారిలోనూ చర్మం లోని తేమను కోల్పోతారు. ఇటువంటివారు మృదువుగా, యవ్వనంగా కనిపించడం కోసం లిక్విడ్ మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఫౌండేషన్ తో పాటు బ్లషేస్ ,బ్లండర్స్ కూడా ద్రవ రూపంలోనే ఎంచుకోవాలి.
మాయిశ్చరైజర్: మాయిశ్చరైజర్ వాడకాన్ని పెంచాలి. ప్రతి రాత్రి నిద్రకు ముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవడంతో పాటు ఉదయం మేకప్ కు ముందు మాయిశ్చరైసర్ ను పూసుకోవాలి దీంతో చర్మం తేమగా మారుతుంది.
ఐ మేకప్: ఐ మేకప్ ని వాడేవారు వీలైనంత తక్కువ ఐ మేకప్ వేసుకోవాలి. ముదురు రంగులు ఉపయోగించడం కళ్ళకు అంత మంచిది కాదు.
అలాగే వయసు పైబడే వారిలో ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలా అని వాటిని దాచడం కోసం అతిగా మేకప్ వేస్తే అసలకే మోసం వస్తుంది. మేకప్ ముడతల్లో ఇంకిపోయి చర్మం మీద సన్నని గీతాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి మేకప్ మరీ మందంగా కాకుండా వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి.
మేకప్ మన ముఖానికి అందం తెస్తుందని కొందరు రాత్రిపూట కూడా వేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఫేస్ లో సహజ సిద్ధమైన మెరుపు అనేది పోతుంది. కాబట్టి రాత్రిపూట మేకప్పు వేసుకోకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.