Health Tips : సాధారణంగా ఎక్ససైజ్ చేసేవారు జిమ్ము ముందు లేదా ఎక్ససైజ్ ముందు పాలు, గుడ్డు లాంటి ఆహారాలు తీసుకొని వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ యోగాలో అలా కాదు యోగ వ్యాయామాలు చేసే ముందు ఏమి తినకూడదు అని కొంతమందిలో అపోహ అనేది ఉంటుంది. అయితే యోగా నిపుణులు వ్యాయామానికి ముందు కూడా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అని చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏంటో తెలుసుకుందాము.
అవకాడో : పొటాషియం, మెగ్నీషియం మొదలైన ఖనిజ లవణాల ఆవకాడలో పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలోని కండరాలు కణాల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాకుండా అవకాడో తేలికగా జీర్ణం అవడంతో పాటు ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యమైన క్రొవ్వులు చెడు కొలెస్ట్రాలను అదుపులో ఉంచుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి యోగా సాధనకు తగినట్లు శరీరం సహకరించడం కోసం ఆవకాడో తినలి.
అరటి పండు : దీనిలోని పొటాషియం లను బట్టి ఎలాంటి వర్కౌట్ లకు ముందైనా తినదగిన పండుగ అరటి పండుకు పేరు ఉంది. కడుపు ఉబ్బరము, కండరాల నొప్పులను అరటిపండు అరికడుతుంది. అరటిపండును నేరుగా లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు.
యాపిల్ : ఇది క్షార గుణం కలిగిన పండు కడుపులో ఆమ్లాత్వం ఏర్పడకుండా చేస్తాయి. సహజ సిద్ధ చక్కరలు పీచు వీటిలో ఎక్కువ. నీరు కూడా వీటిలో ఎక్కువే కాబట్టి యోగ సాధనలో దాహార్తిని అరికట్టగాలుగుతాయి.
బాదం : యోగాకు ముందు నాలుగు బాదం పప్పులు తింటే శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. నీళ్లలో నానబెట్టినవి మినహా ఉప్పు కలిపినవి తినకూడదు. ఆర్గానిక్ బాదం పప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యవంతమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి . యోగాకి ముందు ఈ పదార్థాలను తీసుకోవడం మంచిదని యోగ నిపుణులు చెబుతున్నారు.