Health Tips : ఏడాది పొడవునా లభిస్తూ శరీరానికి ఎంతో మేలు చేసే వాటిలో ముల్లంగి కూడా ఒకటి. సాధారణంగా ఎక్కువ మంది ముల్లంగిని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ ముల్లంగి తింటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముల్లంగి తరచుగా తింటే మలబద్ధకం, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని అంటున్నారు. అలానే పలు రకాల ఉపయోగాలు మీకోసం ప్రత్యేకంగా…
క్యాన్సర్‌కు చెక్ : ముల్లంగి క్రూసిఫెరస్ జాతికి చెందినది. క్రూసిఫెరస్ కూరగాయలు నీటిలో కలిపినప్పుడు ఐసోథియోసైనేట్‌లుగా విడిపోయే సమ్మేళనాలు ఉంటాయి. ఐసోథియోసైనేట్‌లు క్యాన్సర్ కణాలతో పోరాడి కణితి పెరుగుదలను నిరోధిస్తాయని చెబుతున్నారు. దీంతో క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని నిపుణుల సమాచారం.
శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తాయి : ముఖ్యంగా చలికాలంలో ముల్లంగి తినడం వల్ల జలుబు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలతో బాధపడేవారికి ముల్లంగి మంచి ఔషధంలా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ నియంత్రణ : ముల్లంగిలో ఉండే యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. ఇవి రోజు తినడం వల్ల గ్లూకోజ్‌ను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇందులో ఉండే అడిపోనెక్టిన్ హార్మోన్ బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి పని చేస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలానే ఫైబర్ ప్రేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి కూడా బాగా పని చేస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది : ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉన్న కారణంగా రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దింతో హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది. అదే విధంగా పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరచి బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.