Health Tips : బరువు తగ్గడానికి, రోజంతా ఉత్సహంగా ఉండటానికి చాలా మంది ఉదయాన్నే రన్నింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా రన్నింగ్ చేయడం వలన శరీరానికి కావాల్సిన శ్రమ దొరకడమే కాకుండా హెల్తీగా, ఉత్సాహంగా ఉంటారు. వయసుతో నిమిత్తం అనేది లేకుండా పరుగు అనేది అన్ని వయసుల వారికి ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా మనం నడుస్తూ ఉంటాము. లేదంటే కొందరు ఆ నడవడం కూడా మానేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే కాదు అందరికీ పరుగు అనేది ఆరోగ్యానికి ముఖ్యమైనది.
వైద్య నిపుణులు ప్రతిరోజు అరగంట పాటు పరిగెత్తడం గుండెకి మరియు శరీరానికి మంచిదని చెబుతున్నారు. కనీసము రోజులో 10 నిమిషాలైనా పరిగెడితే 10 కాలాల పాటు బ్రతుకుతారని డాక్టర్లు సూచిస్తున్నారు. అలానే ముఖ్యంగా రన్నింగ్ చేసేప్పుడు సరైన షూస్ వేసుకోవాలి. రెగ్యులర్ గా కాకుండా ఒకరోజు సెలవు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన పండ్లు, పదార్థాలు తీసుకోవాలి. అలానే ఎక్కువగా వేగంగా పరిగెత్తకుండా … నీళ్లు ఎక్కువగా తాగకుండా రన్నింగ్ చేయాలని సూచిస్తున్నారు.
- రన్నింగ్ చేయడం వలన శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీనితో చమట పట్టడం, కొవ్వు కరగడం అధిక బరువుని తగ్గిస్తుంది.
- హృదయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. మెరుగైన హృదయనాలా శ్వాసకోశ సమస్యలను రాకుండా ఇస్తుంది.
- రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గించడం. ఎముకల సాంద్రత పెరగడం. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
- సగటున ఒక వ్యక్తి సుమారు మైలు దూరం పరిగెడితే 100 క్యాలరీలు బర్న్ అవుతాయని పరిశోధకులు తెలుపుతున్నారు.
- ఒత్తిడి, ఆందోళన నిరాశ ఇలాంటివి తగ్గించడానికి రన్నింగ్ ఒక మంచి ఔషధంగా చెబుతున్నారు వైద్యులు.
- రన్నింగ్ మానసిక ప్రవర్తనను, నిద్రను మెరుగుపరుస్తుంది.