Night shift Health Care: ఐటీ, మీడియా, ఫార్మా వంటి సంస్థల్లో ఉద్యోగులకు.. ఒకే షిఫ్టుకు పరిమితం కాకుండా వేర్వేరు షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. కొంతమంది రోజుల తరబడి నైట్‌షిఫ్టులకే అంకితమైపోతుంటారు. నైట్షిప్టుల కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. రాత్రిపూట పని చేసేవారికి.. డయాబెటిస్, అధిక బరువు, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, షిఫ్ట్ ప్రకారం పనిచేసే వారికి.. ఛాయిస్ ఉండకపోవచ్చు. వారి ఉద్యోగ పరిస్థితుల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. నైట్‌షిప్ట్‌లో పని చేసే వారు.. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . వారి జీవనశైలిలో మాత్రమే కాకుండా ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాలని అంటున్నారు.
పనికి వెళ్లే ముందు ఇవి తినండి..
నైట్‌షిఫ్ట్ చేసేవారు.. ఇంటి నుంచి బయలుదేరే ముందు సిరిధాన్యాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిది . రాగి రొట్టే, జొన్న రొట్టె, మిల్లెట్ జావ, రాగి జావ తీసుకోవాలని అన్నారు. చిరుధాన్యాలలో విటమిన్ B12, B6 , కార్బోహైడ్రేట్స్, ప్రోటిన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, జింక్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే చిరుధాన్యాల్లో ప్రోటిన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మిల్లెట్స్‌లో జింక్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి మీ కడుపును సంతృప్తిగా ఉంచుతాయి. చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. నైట్‌షిఫ్ట్‌లో ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు మిల్లెట్స్ తీసుకుంటే.. మీకు తినాలనే కోరిక తగ్గుతుంది, మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. ఇవి మీ బరువును కూడా కంట్రోల్లో ఉంచుతాయి.