jasimine tea :టీ అంటే తెలిసిందే ,జాస్మిన్ అంటే కూడా తెలిసిందే , ఈ జాస్మిన్ టీ అంటే ఏంటా అని ఆలోచిస్తున్నార .. నిజానికి వేసవి అంటే సూర్యుడి భగభగలే కాదు.. మల్లెల పరిమళాలు కూడా. ఈ సీజన్‌లో మల్లెలు విరగబూస్తాయి. మల్లెపువ్వును ‘పూల రారాణి’ అంటారు. మల్లె పూవు పరిమళాన్ని ఇష్టపడని వారే వుండరు . మల్లెపువ్వులు అంటే దైవార్చనకు, మహిళలు తలలో పెట్టుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడవనే ఆలోచనలో చాలా మంది ఉంటారు, అయితే దీన్నిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మల్లెపూవ్వు టీని రోజూ తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేయాకునీ, మల్లెపూలను ప్రత్యేక పద్ధతుల్లో డీహైడ్రేట్ చేసి ఈ టీని తయారు చేస్తారు.
ఆ టీ లో పాలిపెనల్స్ అనే మొక్కల సమ్మేళనాలు మన శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, ఫ్రీ రాడికల్స్ కారణంగా కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ కారణంగా.. అనేక రకాల క్యాన్సర్‌లు, గుండె సమస్యలు వచ్చే ముప్పు ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ తో తయారు చేసిన జాస్మిన్ టీలో ఫాలీఫెనాల్స్ మెండుగా ఉంటాయి. ఈ టీలో ప్రత్యేకించి శక్తివంతమైన కాటెచిన్ ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ (EGCG) ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంచడానికి, గుండె, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. EGCGలో బ్లడ్-లిపిడ్-తగ్గించే ప్రభావాలు ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గుతారు..
మల్లోపువ్వు టీ తాగితే.. జీవక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ఇది మీ జీవక్రియను 4-5% వేగవంతం చేస్తుంది, 10-16% వేగంగా కొవ్వును కరిగిస్తుంది. ఈ టీ రోజుకు 70–100 కేలరీలు అదనంగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. జాస్మిన్ టీలో EGCG లక్షణాలు కొవ్వును వేగవంతంగా కరిగిస్తాయి.