Hareesh Peradi In A Vital Role In Mishan Impossible, Matinee Entertainment, Latest Telugu Movies, Telugu World Now,
Tollywood News: తాప్సీ `మిషన్ ఇంపాజిబుల్`లో కీలక పాత్రలో నటిస్తోన్న మలయాళ విలక్షణ నటుడు హరీశ్ పేరడి
తెలుగులో హీరోయిన్గా కెరీర్ను స్టార్ట్ చేసి బాలీవుడ్లో అడుగు పెట్టి సక్సెస్ఫుల్ హీరోయిన్గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్టార్ తాప్సీ. రీసెంట్గా ఈమె టాలీవుడ్లో `మిషన్ ఇంపాజిబుల్` సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తాప్సీ లీడ్ రోల్ చేస్తుంది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ స్టార్స్ అందరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం ఎవరైతే బాగుంటుంది అని
ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మలయాళ నటుడు హరీశ్ పేరడీ ఆ పాత్రకి కరెక్ట్ గా సరిపోతాడు అని ఆయన్ని తీసుకున్నారు. మలయాళ చిత్రసీమలో తన నటనతో గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, కళ్లతోనే విలనిజాన్ని చూపిస్తూ ప్రత్యేకమైన గుర్తింపుపొందారు.
ఎరిడ, తంబి, మెర్సల్, ఖైది, స్పైడర్, రాక్షసి, పులి మురుగన్, భూమియిలే, మనోహర, స్వకార్యం, మడ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, విక్రమ్ వేద ఇలా నలబైకి పైగా చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నీ ఆయనకు నటుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టడమే కాదు.. ఓ ప్రత్యేకస్థాన్ని సంపాదించిపెట్టాయి.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు, రవితేజ గిరిజల ఎడిటర్.
సాంకేతిక వర్గం:
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
రచన, దర్శకత్వం: స్వరూప్ ఆర్ ఎస్ జె
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఎన్ ఎం పాష
సినిమాటోగ్రఫి: దీపక్ యరగర
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: రవితేజ గిరిజల
ఆర్ట్: నాగేంద్ర
పిఆర్ఓ: వంశీ – శేఖర్