Health జుట్టు విషయం లో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి లేదంటే విపరీతంగా వూడిపోయే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో మారిపోతున్న జీవన్ శైల తో పాటు కాలుష్యం కారణాలతో జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువ అయిపోతుంది అయితే దీనిపై పలు పరిశోధనలు జరిపిన ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
జుట్టు సక్రమంగా ఎదగాలని చాలామంది కోరిక అయితే ఇది అందరిలో తీరే విషయం కాదు కానీ కొందరు జుట్టు విషయంలో కొంత అజాగ్రత్త పాటిస్తూ ఉంటారు తలకు ఎక్కువగా నూనెని రాసుకొని బయటికి వెళ్ళటం వంటివి చేయడం వల్ల బయట ఉండే కాలుష్యం మొత్తం జుట్టుగా చేరుతుంది దీనివలన ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది అలాగే చుండ్రు సమస్య కూడా వేధిస్తుంది అలాగే కొందరు తలస్నానం చేసిన వెంటనే జుట్టును సరిగ్గా ఆరకముందే బయటకు వెళుతూ ఉంటారు ఇలాంటి సమయంలో కాలుష్య కారణాలతో జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది అయితే ముఖ్యంగా నూనె విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..
కొందరు జుట్టుకు నూనెను చాలా ఎక్కువగా రాసుకుంటూ ఉంటారు అయితే ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు దీనివలన చుండ్రు సమస్య చాలా ఎక్కువ అవుతుందని జుట్టుకు నూనె రాయడం వల్ల పెరుగుతుందని ఎక్కడ నిర్ధారణ కాలేదని తెలిపారు అయితే తలస్నానం చేయడానికి ఒక గంట ముందు మాత్రం చుండ్రు ఉన్నవాళ్లు మాడుకి నూనెను పట్టించకుండా చిగుళ్ళకి రాసుకొని తలస్నానం చేయడం వల్ల జుట్టుపొడి బారే సమస్య నుంచి దూరం కావచ్చని తెలుస్తోంది..