Hair Care: అందరి జుట్టూ ఒకే రకంగా ఉండదు. కొందరిది స్మూత్ సిల్కీ హెయిర్ అయితే, మరికొందరికి ఉంగరాల జుట్టు ఉంటుంది, కొంతమందికి సెమీ సిక్లీ హెయిర్, అలల్లాంటి జుట్టు ఉంటుంది. అయితే, అన్ని రకాల జుట్టు ఉన్నవారు తలస్నానం చేసేప్పుడు.. ఒకే విధానాన్ని ఫాలో అవుతూ ఉంటారు. జుట్టు రకం బట్టి తలస్నానం చేస్తే.. కేశాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే.. కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఉండవు. మీ జుట్టు బట్టి ఎలా స్నానం చేయాలో చూద్దాం.
ఆయిలీ హెయిర్ అయితే..
ఆయిలీ హెయిర్ ఉన్నవారికి.. కుదుళ్లలో ఉండే నూనె గ్రంథులు అధికంగా నూనెలను ఉత్పత్తి చేయడం వల్ల కుదుళ్లు, జుట్టు జిడ్డుగా మారతాయి. ఫలితంగా చుండ్రు, దురద సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆయిలీ హెయిర్ ఉన్న వారు రోజు విడిచి రోజు తలస్నానం చేయాల్సి ఉంటుంది. వీళ్లు నూనె ఆధారిత షాంపూలకు దూరంగా ఉండాలి. ఆయిలీ హెయిర్ ఉన్నవారు.. జుట్టు చివర్లకు మాత్రమే కండీషనర్ అప్లై చేయాల్సి ఉంటుంది.
పొడి జుట్టు ఉన్నవారు..
డ్రై హెయిర్ ఉన్నవారు జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు గడ్డిలా మారడం, కుదుళ్లలో దురద, అలర్జీలు రావడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పొడి జుట్టు ఉన్నవారు వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. అలాగే సహజమైన షాంపూలతో మాత్రమే తలస్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బాగా వేడిగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయకూడదు.
సెమీ కర్లీ హెయిర్..
సెమీ కర్లీ హెయిర్ ఉన్న వారు వారంలో రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలి. ఒకవేళ మీ జుట్టు బాగా ఒత్తుగా ఉన్నట్లయితే వారానికి రెండుసార్లు చేసినా సరిపోతుంది. వీళ్లు నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోకపోవడమే మంచిది. వీటివల్ల జుట్టు సహజమైన కర్లీనెస్ని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకుంటే జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ జరగదు.