Green Tea For Skin :గ్రీన్ టీ.. హెల్దీ డ్రింక్.. దీని వల్ల మీ ఆరోగ్యంతో పాటు అందానికి కూడా మంచిది. ఈ టీతో ముఖాన్ని క్లీన్ చేస్తే ముఖంలోని జిడ్డు దూరమై మొటిమలు, నల్ల మచ్చలు మాయమవుతాయి. దీని వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.
చర్మ సమస్యలు..
గ్రీన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ చర్మ చికాకుని దూరం చేసే ఎరుపు, చర్మ వాపుని తగ్గిస్తుంది. అందుకోసం గ్రీన్ టీ టోనర్, జెల్‌ని చర్మానికి అప్లై చేయొచ్చు. దీని వల్ల ఎండ వల్ల కలిగే చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
మొటిమలకి చెక్..
గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన శక్తివంతమైన పదార్థం. ఇది యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మొటిమలని దూరం చేస్తుంది. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇది మొటిమలు ఏర్పడటానికి ప్రధాన కారణం. గ్రీన్ టీ వల్ల ఈ సమస్య దూరమవుతుంది.
యవ్వనంగా..
గ్రీన్ టీలో ఉండే గొప్ప గుణాలు చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేసి కొత్త కణాల ఏర్పాటుకు హెల్ప్ చేస్తుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా ముడతలు రాకుండా చేస్తుంది.
చర్మ క్యాన్సర్..
ఫ్రీ రాడికల్స్ మీ చర్మాన్ని దెబ్బతీసే కారకాలు. ఎక్కువగా కాలుష్యం, యూవీ రేడియేషన్ వంటి పర్యావరణ ఒత్తిళ్ల వల్ల ఇది వస్తుంది. ఫ్రీ రాడికల్స్ మీ డీఎన్‌ఏని దెబ్బతీస్తాయి. ఇది చర్మ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకి దారితీస్తుంది. కానీ యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి.