Green tea:గ్రీన్ టీ.. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు. చర్మానికి కూడా చాలా మంచిది. అయితే, దీనిని చర్మంపై పూతలా రాయడం వల్ల కూడా చక్కని మోము మీ సొంతమవుతుంది. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు పూర్తిగా తగ్గుతాయి. అయితే, వాటిని ఎలా అప్లై చేయాలో చూద్దాం.
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో నీరు పోసి మరిగించి ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ వేసి 7 నుంచి 8 నిమిషాలు ఉడికించాలి. నీరు కాస్తా రంగు మారాక స్టౌ ఆఫ్ చేయండి. ఆ తర్వాత దీనిని కాసేపు చల్లారనివ్వండి.
ఇప్పుడు గ్రీన్ టీని ఐస్ ట్రేలో పోసి 4 నుండి 5 గంటల పాటు ఫ్రీజర్ పెట్టి ఉంచండి. ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. వీటిని మీరు అందాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు. కాబట్టి, రెగ్యులర్‌గా వీటిని వాడొచ్చు.
ఇలా తయారైన ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రబ్ చేయండి. దీనిని శరీరానికి కూడా అప్లై చేయాలి. దీని పడుకునే ముందే అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇలా తయారైన క్యూబ్స్‌ని 2 రోజుల వరకూ వాడొచ్చు. దీనిని వాడడం వల్ల చాలా వరకూ సమస్యలు దూరమవుతుంది.దీనిని వాడడం వల్ల మొహం లో ఇన్స్టంట్ గ్లో వస్తుంది .
కొన్ని రోజులకి కచ్చితం గా మొటిమలు దూరం అవుతాయి . చాలా వరకు ఎన్ని చేసినా మొటిమలు తగ్గవు. వాటి మచ్చలు అలానే ఉండిపోయి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి అప్పుడు మొటిమలు తగ్గాలంటే గ్రీన్‌టీని వాడితే చక్కను పరిష్కారం చూపుతుంది .