రాయలసీమ ఎత్తిపోతల తొలి దశకు గ్రీన్ సిగ్నల్, చెన్నై, రాయలసీమకు అవసరమైన తాగునీటి సరఫరా పనులకు ప్రాధాన్యత, 2,913 క్యూసెక్కుల సామర్ధ్యం చొప్పున ఆరు పంపుల ఏర్పాటు, రాష్ట్ర జల వనరుల శాఖ ఉత్తర్వులు, జూన్ – జులై మధ్య 59 టీఎంసీలను తరలించడం ద్వారా చెన్నై, రాయలసీమకు నీటి సరఫరా పర్యావరణ అనుమతి వచ్చేలోగా ఈ పనులు పూర్తి చేసే దిశగా చర్యలు శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు, శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా.. ప్రస్తుత డిజైన్ మేరకు 44వేల క్యూసెక్కులు తరలించే అవకాశం, ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు.
ఎస్సార్సీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు – నగరికి 38 వెరసి.. 101 టీఎంసీలు సరఫరా చేయాలి, రాయలసీమ ఎత్తిపోతలతో.. వైఎస్‌ఆర్ కలలు సాకారం చేసే దిశగా సీఎం జగన్ అడుగులేస్తున్నారు.