రాజ్యసభ సభ్యులు, ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఛైర్మన్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ గారు నిర్మాతగా, పూర్ణచందర్ డైరక్షన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-వ్యవస్థాపకులు రాఘవ నేతృత్వంలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్ర భారతి లో, 06.12.2021 సాయంత్రం 7.00 గంటలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక పాటను గౌరవ మంత్రివర్యులు శ్రీ జి. జగదీష్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు డా. వి. శ్రీనివాస్ గౌడ్ గారు, TSIIC ఛైర్మన్ శ్రీ బాలమల్లు గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ పాటకు ప్రముఖ రచయిత మాట్ల తిరుపతి గారు రచన మరియు సంగీతం సమకూర్చారు.
ఈ కార్యక్రమంలో ఛైర్మన్ లు గ్యాదరి బాలమల్లు, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, BC కమిషన్ సభ్యులు కిషోర్, శుభప్రద్ పటేల్, ఉపేందర్, రాఘవ, డైరెక్టర్ పూర్ణచందర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.