రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభిం చిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రం అని జపాన్‌లో భారత రాయబారి సంజయ్‌కు మార్‌వర్మ ప్రశంసించారు. గ్లోబల్ వార్మింగ్‌పై పో రాటంలో గ్రీన్‌చాలెంజ్ ప్రజలను మేల్కొలిపి ప్రపంచాన్ని ఏకం చేస్తు న్నదని కొనియాడారు. మన భవిష్యత్‌తరాలకు స్వచ్ఛమైన పర్యావ రణాన్ని అందించేందుకు, ప్రపంచ సుస్థిరాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
ఇటీవల జపాన్‌లోని కోహన ఇంటర్నేషన ల్ స్కూల్‌లో మొక్కలు నాటిన ఆయన, బుధవారం సంతోష్‌కుమార్ కు లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నద ని తెలిపారు. భారత్, జపాన్ వాతావరణ మార్పుతోపాటు అనేక అం శాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని గుర్తుచేశారు.