Health చాలావరకు పండ్లను తిని అందులో ఉండే గింజల్ని బయటకు పడేస్తూ ఉంటాము.. అయితే కొన్ని పంటలో కన్నా గింజల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని తెలుస్తోంది.. ద్రాక్ష పళ్ళను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటుంటారు ఆరోగ్య నిపుణులు.. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం తో పాటు చర్మం కూడా ఎంతో నిగారింపును సంతరించుకుంటుంది .
ద్రాక్ష గింజల్లో ఉండే ఎన్నో పోషకాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా మెదడులో ప్రోటీన్ లోపం వల్ల వచ్చే అల్జీమర్స్ కూడా నివారించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే ద్రాక్ష పండ్ల గింజలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేటట్టు చేయటమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.. అలాగే గుండెకు సక్రమంగా రక్తాన్ని పంపచేయడంలో కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తాయి.. ద్రాక్ష పళ్ళు కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఎముకలు బలంగా తయారవ్వటానికి కూడా ఇవి సహాయ పడతాయి.. అలాగే నేరేడు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది.. ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇవి అల్సర్, వాపులు వంటి సమస్యతో బాధపడేవారికి నేరేడు గింజల పొడి మంచి ఔషధంలా పని చేస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.