Govinda baje Govinda Movie First Look Poster Release, Producer Bekkam Venu Gopal, Director Naresh, Latest Telugu Movies, Telugu World Now
FILM NEWS: గోవిందా భజ గోవిందా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత బెక్కం వేణు గోపాల్, డైరెక్టర్ నరేష్
విజయ శ్రీ క్రియేషన్స్ పతాకంపై డాలీ సమర్పణలో రూపొందిన గోవిందా భజ గోవిందా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి హీరోగా దుర్మార్గుడు ఫేమ్ విజయ్ కృష్ణ, హీరోయిన్ గా ప్రియా శ్రీనివాస్ నటించారు. అలాగే కో ఆర్టిస్టులుగా కమల్ తేజ, సూర్యతేజ, తేజ తదితరులు నటించడం జరిగింది. ఈ సినిమాకి సూర్య కార్తికేయ & ఉపేంద్ర నిర్మాతలు. ఈ సినిమా పూర్తిగా హాస్యభరితంగా ఉంటుందని ఫ్యామిలి తో వచ్చి హ్యాపిగా నవ్వుకోవచ్చని దర్శకుడు సూర్య కార్తికేయ తెలిపారు. ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి ఇప్పుడు మొదటి సారిగా దర్శకుడిగా, నిర్మాతగా గోవిందా భజ గోవిందా చిత్రాన్ని నిర్మించారాయన. ఈ చిత్రం నవ్వును కోరుకునే వాళ్ళు కచ్చితంగా నవ్వుకోని హ్యాపీగా తిరిగి వస్తారని దర్శకుడు తెలిపారు.