Political కాంగ్రెస్‌తో సుదీర్ఘ కాలం కలిసి పనిచేసి, ఇటీవలే ఆ పార్టీని విడిన గులాం నబీ ఆజాద్…. కశ్మీర్‌లో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ కారణంగా… ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, పలు ర్యాలీలు, సభలను నిర్వహిస్తున్నారు. అలా ఇటీవల నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ…. కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆయుధాలను వీడాలని పిలుపునిచ్చారు. ఆయుధాల వల్ల వినాశనం తప్ప మరేమీ ఉండదని అన్నారు. అంతా కలిసి శాంతి వైపు అడుగులు వేయాలని సూచించారు. దీంతో… ఓ ఉగ్రసంస్థ గులాం నబీ ఆజాద్‌ను ద్రోహి అంటూ… బెదిరింపు సందేశాన్ని పంపించింది. దక్షిణ కశ్మీర్‌లోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన అనంతనాగ్‌లోని దాల్ బంగ్లా లాన్స్‌లో గురువారం ఆజాద్ ఓ ర్యాలీలో ప్రసంగించారు. అందులో… తుపాకీ సంస్కృతి కశ్మీర్‌లో కొన్ని తరాలకు తీవ్రంగా హాని చేస్తుందని అన్నారు. ఈ విష సంస్కృతికి ముందు తరం కశ్మీరీ యువకులు బలికాకూడదంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌తో సుదీర్ఘ కాలం కలిసి పనిచేసి, ఇటీవలే ఆ పార్టీని విడిన గులాం నబీ ఆజాద్…. కశ్మీర్‌లో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ కారణంగా… ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, పలు ర్యాలీలు, సభలను నిర్వహిస్తున్నారు. అలా ఇటీవల నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ…. కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆయుధాలను వీడాలని పిలుపునిచ్చారు. ఆయుధాల వల్ల వినాశనం తప్ప మరేమీ ఉండదని అన్నారు. అంతా కలిసి శాంతి వైపు అడుగులు వేయాలని సూచించారు. దీంతో… ఓ ఉగ్రసంస్థ గులాం నబీ ఆజాద్‌ను ద్రోహి అంటూ… బెదిరింపు సందేశాన్ని పంపించింది. దక్షిణ కశ్మీర్‌లోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన అనంతనాగ్‌లోని దాల్ బంగ్లా లాన్స్‌లో గురువారం ఆజాద్ ఓ ర్యాలీలో ప్రసంగించారు. అందులో… తుపాకీ సంస్కృతి కశ్మీర్‌లో కొన్ని తరాలకు తీవ్రంగా హాని చేస్తుందని అన్నారు. ఈ విష సంస్కృతికి ముందు తరం కశ్మీరీ యువకులు బలికాకూడదంటూ వ్యాఖ్యానించారు.
దాంతో పాటే… కశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ అసాధ్యమంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్… తన రాజకీయ ప్రయోజనాల కోసం కశ్మీర్ యువతను తప్పుదోవ పట్టించనని అన్నారు. ప్రత్యేక ఆర్టికల్‌ను తిరిగి తీసుకురావాలంటే… పార్లమెంట్‌లో 2/3 వంతు మెజార్టీ ఉండాలని… లేకపోతే సుప్రీం కోర్టు ద్వారా మాత్రమే ప్రయత్నించాలని పేర్కొన్నారు. కానీ… గడిచిన మూడేళ్లలో సుప్రీం కోర్టు ఆ అంశానికి సంబంధించిన కేసుల్లో వాదనలు కూడా వినలేదని గుర్తు చేశారు.