Ghee : నెయ్యి, పురాతన కాలం నుండి ఆహారంలో వినియోగిస్తున్న సూపర్‌ఫుడ్. ఇది అనేక పోషక లక్షణాలను కలిగి ఉంది. ఆయుర్వేద శాస్త్రీయ గ్రంథం చరక సంహిత పాల ఘనపదార్థాలను తీసివేసిన తర్వాత తయారు చేయబడిన వెన్న గురించి గొప్పగా వివరించింది. వాత మరియు పిత్త రుగ్మతలతో బాధపడుతున్న వారికి , జీర్ణక్రియను సులభతరం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి చూపు వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలకు నెయ్యిని సిఫార్సు చేస్తుంది.
అయితే నెయ్యి దానికున్న ప్రయోజనాలను పొందాలంటే సరైన మార్గంలో, సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం. నెయ్యి ని చపాతీలలో, పప్పుఅన్నంలో మరియు ఇతర కూరలలో వాడుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదు శరీరానికి అందుతాయి. నెయ్యి వంటకానికి రుచిని పెంచడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను, విటమిన్లు A, D, E మరియు K నుండి ఒమేగా-3 , ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది, ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నెయ్యిలో బ్యూటిరేట్ కూడా ఉంది, ఇది ఒక చిన్న-గొలుసు కొవ్వు ఆమ్లం, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ , గట్ హెల్త్ బెనిఫిట్స్‌తో సంబంధం కలిగి ఉంటుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం మంచిదేనా?
నెయ్యితో రోజును ప్రారంభిస్తుంటే ఇది ఏమాత్రం మంచి ఆలోచన కాదని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యి జీర్ణక్రియకు మేలు చేస్తుందని మనందరికీ తెలుసు, కాని ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం సరైందే, ఎందుకంటే ఇది జీర్ణక్రియకు గొప్పది. అలాగని ఉదయం తీసుకోవటం వల్ల మేలు కలుగుతుందని చెప్పలేము. నెయ్యి అనేది ఒక భారీ ఆహారం. కొద్ది మొత్తంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది అద్భుతమైన జీర్ణ సహాయకంగా పనిచేస్తుంది. అయితే నెయ్యిని వేడిచేసి తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.