Bhakthi హిందూ సంప్రదాయంలో మరో పవిత్రమైన గ్రంథం గరుడ పురాణం ఈ గరుడ పురాణంలో మనిషి పుట్టిన దగ్గరనుంచి చనిపోయేంతవరకు చేసిన కర్మల గురించి పూర్తి వివరణ ఉంది అంతేకాకుండా చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఏమవుతుంది అనే విషయాలను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది అంతేకాకుండా అలాగే ఎలాంటి వారు స్వర్గానికి వెళ్లే ప్రాప్తి ఉంటుంది ఎలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారో సుదీర్ఘ వివరణ ఈ గ్రంథంలో ఉంది.. బతికున్నప్పుడు మనుషులు చేసే కర్మలను బట్టి చనిపోయాక వాళ్ళు ఎక్కడికి వెళ్లాలి అనేది రాసిపెట్టి ఉంటుందని చెప్తుంది.
గరుడ పురాణం కొన్ని లక్షణాలు ఉన్నవాళ్లు కచ్చితంగా నరకానికి వెళ్తారని చెప్తుంది అది ఏంటంటే.. చనిపోయిన వాళ్ళు వెళ్లే మార్గం వారు చేసిన కర్మలను బట్టి మూడు లోకాలుగా విభజించబడింది.. మొదటిది బ్రహ్మలోకం.. రెండవది పితృలోకం.. మూడవది వినాశలోకం.. ఎవరైతే భూలోకంలో పాపపు పనులు చేస్తారో వాళ్ళందరూ వినాశ లోకానికి పోతారు అని వివరిస్తుంది.
భూలోకంలో ఉన్న నీటి జలాలను చెడగొట్టి జనాలకు నీరు అందకుండా చేస్తారో అలాంటి వాళ్ళు దైవభక్తి అసలు లేకుండా దేవుడిని నిందించే వాళ్ళు.. చనిపోయిన తమ పితృదేవతలకు ఎవరైతే తగిన సంస్కారాలు చేయరో ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా నరకానికి పోతారని గరుడ పురాణం చెప్తుంది. ఆకలితో ఉన్న వాళ్లకి అన్నం పెట్టని వాళ్లు హత్యలు చేసేవాళ్లు ఆడవాళ్ళని హత్య చేసేవాళ్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకానికి పోతారని గరుడ పురాణం వివరిస్తుంది.