ganji chiranjjevi గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలింది. మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. నేడు ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన గంజి చిరంజీవి.. జగన్ పాలనలో రాష్ట్రం చాలా మారిందని అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. తెలుగు దేశం పార్టీలో బీసీలకు అవమానం జరుగుతుందని వాపోయారు. టీడీపీలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా గౌరవం లేదని చెప్పారు. 2014 ఎన్నికల్లో మంగళగిరి అభ్యర్ధిగా పోటీ చేసిన గంజి చిరంజీవి ఈ మధ్యే టీడీపీకి రాజీనామా చేశారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరుతానని ఆ రోజు వెల్లడించారు.
అయితే రాబోయే ఎన్నికల్లో ఇదే నియజక వర్గం నుంచి గంజి చిరంజీవి వైసీపీ తరపు నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇదే జరిగితే టీడీపీ కి గట్టి దెబ్బ తగిలినట్టే. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఇదే నియోజకవర్గం నుండి నారా లోకేష్ పోటీ చేయనున్నారు. ఇలా జరిగితే ఇద్దరి మధ్య భారీ పోటీ నెలకొని ఓట్లు చీలిపోయే ప్రమాదం వుంది..