దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి ఘనంగా జరుగుతోంది. కరోనాతో రెండేళ్ల పాటు ఎలాంటి సందడి లేకుండా జరగడంతో ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు సినీనటులు చిరంజీవి, అల్లు అర్జున్, నటి కీర్తిసురేష్ తదితరులు వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు.