Misses Queen of Telangana : G మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో మిసెస్ క్వీన్ అఫ్ తెలంగాణ అందాల పోటీ డిసెంబర్ 28 న నిర్వహించబడుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ లాంచ్ ఈవెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్ లోవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రముఖ తారలు రాశి, ఇంద్రజ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు వారిద్దరి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ జరిగింది. అలాగే ఈ ఈవెంట్ లో మాజీ మిసెస్ ఇండియా ఫైనలిస్ట్ ప్రియ కసబా, నటి సోని చరిష్ట, సీరియల్ ఆర్టిస్ట్ మహతి , యాంకర్ హాసిని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఈవో కిరణ్ మాట్లాడుతూ”ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్త్రీ సాధికారత. మహిళలు కేవలం ఒంటింటి కె పరిమితం అవ్వకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం కలిపిస్తోంది . ఈవెంట్ ఆడిషన్స్ ఈనెల 14 నుంచి 21 వరకు జరుగుతాయి .అలాగే గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ డిసెంబర్ 28న వైభవంగా జరగనుంది.అని G మీడియా CEO కిరణ్ గారు తెలిపారు.