యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ పై భారీ అంచనాలు వున్నాయి. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్ బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచాయి. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తం గా విడుదలౌతున్న ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. దర్శకులు హను రాఘవపూడి, సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్, వక్కంతం వంశీ, మేర్లపాక గాంధీ ప్రీరిలీజ్ వేడుకకు అతిధులుగా హాజరయ్యారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన అతిధులకు, అభిమానులకు కృతజ్ఞతలు. అందరికీ హ్యాపీ ఫ్రండ్షిప్ డే. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. ఈ ప్రయాణంలో ప్రేక్షకులు, ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే మీ ముందు ఇలా వుండేవాడిని కాదు. మీ ప్రేమకు కృతజ్ఞతలు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే వుండాలని కోరుకుంటున్నా. ‘మాచర్ల నియోజకవర్గం’ నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న సినిమా. ఇందులో నటించిన సముద్రఖని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మజీ, వెన్నల కిషోర్.. అందరికీ కృతజ్ఞతలు. సముద్రఖని గారు మాకు ఎంతో సహకరించారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నా. ఆయన దర్సకత్వంలో నటించాలని కూడా కోరుకుంటున్నాను.
ఇందులో వెన్నెల కిషోర్ కామెడీ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ గా వుంటుంది. మా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మా ఆస్థాన టెక్నిషియన్ అయిపోయారు. తిరు డైలాగ్స్ చాలా బాగా రాశాడు. ఈ సినిమా కథ కి హెల్ప్ చేసిన వక్కంతం చైతుకి కూడా చాలా థాంక్స్. తన సపోర్ట్ చాలా ఎనర్జీని ఇచ్చింది. పాటలు రాసిన శ్యామ్, చైతు, కేకే నా కెరీర్ లో ప్రధాన భాగంగా వున్నారు. ఎన్నో సూపర్ హిట్ పాటలు రాశారు. ముందుముందు కూడా మంచి పాటలు రాయాలి. మహతి స్వర సాగర్ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు.
ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. ఆర్ఆర్ చేయడంలో మణిశర్మ గారు కింగ్ అంటారు. కానీ ఈ సినిమాలో సాగర్ తండ్రిని మించిన తనయుడనిపిస్తాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగొట్టాడు. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కాదు గూస్ పింపుల్సే. ప్రసాద్ మురెళ్ళ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో వున్న ఫైట్స్ నా కెరీర్ లోనే ది బెస్ట్ ఫైట్స్. అనల్ అరుసు, వెంకట్, రవి వర్మ, విజయ్ మాస్టర్స్ ఇరగదీశారు. ప్రతి ఫైట్ హైలెట్. డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ, జిత్తుకి థాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్. కేథరిన్ తో పని చేయడం ఆనందంగా అనిపించింది. కృతి శెట్టి చూడటానికి అమాయకంగా సాఫ్ట్ గా వుంటుంది. కానీ కృతిలో చాలా పరిణితి వుంది. షూటింగ్ సమయంలో తను అడిగే సందేహాలు చాలా స్మార్ట్ గా వుంటాయి. చాలా తక్కువ మంది హీరోయిన్స్ లో ఈ క్యాలిటీ చూశాను. ఆమె చాలా దూరం ప్రయనించాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు శేఖర్ నాకు ఎప్పటినుండో నాకు ఫ్రండ్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇది తన మొదటి సినిమాలా వుండదు. చాలా అనుభవం వున్న దర్శకుడిలా ఈ సినిమాని తీశాడు. ఈ సినిమాతో శేఖర్ మంచి కమర్షియల్ దర్శకుడౌతాడు. నిర్మాతలైన మా నాన్న, అక్కకి థాంక్స్. సినిమాని చాలా బాగా తీశాము. సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాం. ఆగస్ట్ 12న గట్టిగా కొట్టబోతున్నాం. ఆగస్ట్ 12 న థియేటర్ లో కలుద్దాం. మీ అందరి ప్రేమ కావాలి” అని కోరారు.