Free Vaccination : Prime Minister Narendra Modi , Covid Vaccine, Corona News,
18 సంవత్సరాలు పై పడిన వయస్సు వారందరికీ ఉచిత వాక్సిన్ : ప్రధానమంత్రి మోడీ
– 45 ఏళ్లకు పైబడిన వారిలో రాష్ట్రాలలో మిగిలిపోయిన దాదాపు 25 శాతం మందికి కేంద్ర ప్రభుత్వం రెండు వారాల పాటు ఉచితంగా వాక్సిన్ అందజేస్తుంది.
– జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.
– ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆరోజు నుంచి 18 ఏళ్ల ఫై పడిన వయస్సు ఉన్న వారందరికి ఉచితంగా వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది.
– ఆ మేరకు ఏ రాష్ట్రానికి, ఎప్పుడు, ఎన్ని వాక్సిన్లు ఇస్తామన్నది ముందుగానే తెలియజేస్తాము.
– వాక్సిన్లపై ఇక నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆ ఖర్చును కేంద్రమే పూర్తిగా భరిస్తుంది.
– ఇందుకోసం దేశంలో మొత్తం వాక్సిన్ ఉత్పత్తిలో 75 శాతం కేంద్రమే స్వయంగా కొనుగోలు చేసి, రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది.
– ఎవరైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో వాక్సిన్ వేసుకోవాలంటే వారి కోసం ఉత్పత్తిలో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు ఉత్పత్తి సంస్థలు ఇస్తాయి.
– ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్కు కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాలి.
–ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మే, జూన్ నెలల్లో మాత్రమే దేశంలో దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు దాన్ని ఈ ఏడాది దీపావళి వరకు పొడిగించడం జరిగింది.
– ఆ విధంగా ఈ ఏడాది నవంబరు వరకు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందుతుంది