Rachakonda News : ఈ రోజు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ యొక్క అన్ని పోలీస్ స్టేషన్ల కమ్యూనికేషన్ వ్యవస్థను అనలాగ్ నుండి డిజిటల్ కు మార్చడం జరిగింది. దీని ద్వారా ఇకనుండి కమిషనరేట్ ఆఫీస్ నుండి మహేశ్వరం జోన్ పరిధిలోని 1715 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం 10 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల అధికారులు మరియు సిబ్బందితో ఎటువంటి అంతరాయం లేకుండా సత్వర సమాచారం అందించడం సాధ్యమవుతుంది. ఈ డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థ భారతదేశంలోనే తొలిసారిగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్లో ప్రవేశపెట్టడం గమనార్హం.
ఇందుకోసం ఎటువంటి అదనపు వ్యయం అవసరం లేకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాల సహాయంతోనే ఈ నూతన డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అని కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కమిషనరేట్ పరిధిలోని మిగిలిన జోన్లలో కూడా ఇటువంటి వ్యవస్థనే ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఐజి ఐటీ & కమ్యూనికేషన్ శ్రీ జె.శ్రీనివాసరావు, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నరసింహా రెడ్డి, ఎస్పీ ఆర్.జె.సుధాకర్, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, డీఎస్పీ జి.బాబు, డీఎస్పీ జి.శ్రీనివాసులు, ఏసీపీ ఐటి సెల్ నరేందర్ గౌడ్, ఎసిపి సిసిఆర్బి రమేష్, ఇన్స్పెక్టర్లు జి.మురళీ కృష్ణా రెడ్డి, ఎ.భాను ప్రసాద్, ఎన్.జ్ఞాన సుందరి, సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్.నరేందర్ రెడ్డి, స్వామి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.