Political అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పునరుత్పాదన ఇంధన వనరుల కల్పనపై దృష్టి పెట్టిన మోదీ ప్రభుత్వం… నిర్దేశిత లక్ష్యాల్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఆ క్రమంలోనే దేశంలోనే తొలి సంపూర్ణ సోలార్ గ్రామం గుజరాత్‌లోని మొధేరా తీర్చిదిద్దింది. శుక్రవారం గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని మోదీ భారత్‌లోనే తొలి సోలార్ విద్యుత్ గ్రామంగా మెహసానా జిల్లాలోని మొధేరా గ్రామాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకూ సూర్య దేవాలయం కలిగి ఉన్న గ్రామంగా గుర్తింపు పొందిన మొధేరా… ఇప్పటి నుంచి సంపూర్ణ సోలార్ విద్యుత్ వినియోగిస్తున్న గ్రామంగా కూడా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ గ్రామ ప్రజలు గతంలో నీళ్లు, విద్యుత్ కోసం ఎన్నో అవస్థలు పడ్డారని గుర్తు చేసిన మోదీ…. మహిళలు నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచే వారని.. ఇప్పటి తరానికి ఆ బాధల్లేవన్నారు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యంతో పరిశ్రమలను స్థాపించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, రవాణా అనుసంధానతతో వంటివి పెంచడంతో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలుగుతామన్నారు. అలాగే… ఒకప్పుడు సైకిళ్లను తయారు చేయలేని రోజుల నుంచి… నేడు గుజరాత్ కార్లు, మెట్రో కోచ్‌లను తయారు చేసే స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. విమానాలను సైతం తయారు చేసే రోజు ఇంకెంతో దూరం లేదన్నారు. భారత్ రోజు రోజుకు అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని.. అలాగే మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు మోడీ..