Crime News:గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలేనికి చెందిన కొణతాల హేమలత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హేమలత భర్తతో విభేదాల కారణంగా గత రెండేళ్ల నుంచి విడిపోయి జీవిస్తుంది. అయితే ఈమె పుట్టినిల్లు విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం మంగళపాలెంలోని జీవనం కొనసాగిస్తుంది. వృత్తి పరంగా ఆమె బ్యూటీషియన్ కోర్సు చేసింది. శుభకార్యాలకు, మేకప్‌లు వేస్తూ తన ఇద్దరి పిల్లలను పోషిస్తూ ఉండేది.
అయితే ఈ క్రమంలోనే కోటనరవకు వరకు చెందిన కె.కుమార్‌తో పరిచయం ఏర్పడి వీరిద్దరి పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. గత శుక్రవారం సాయంత్రం అమ్మగారి ఇంటి నుంచి హేమలత కుమార్ ను కలిసి ఎందుకు వెళ్ళింది.ఇద్దరూ కలిసి సతివానిపాలెం రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రాత్రి అంతా గడిపి శనివారం వేకువ జామున ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారట.. అక్కడి చేరుకున్న ఈ జంట రైలు కోసం నిరీక్షించడంతో ఆఖరి క్షణంలో మనసు మార్చేందుకు ప్రయత్నించుకోగా. హేమలతను వెనక్కి లాగే ప్రయత్నం చేయగా ఆమె కుమారితో గొడవపడి రైలుకు ఎదురుగా వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది.
ట్రైన్ పక్కనే ఉన్న కుమార్ ట్రైన్ తాకిడికి కింద పడుకోవడంతో దెబ్బలు తగులుంటాయని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. అక్కడ సమీపంలో గార్డు గాయలతో చూసిన కుమార్‌ని వెంటనే 108 కి కాల్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టంకు కేజీహెచ్‌కు తరలించడం జరిగింది.