Health ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు.. అయితే చాలామంది తెలిసి తెలియక ఈ విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.. ఈ సమయంలో చేసే వ్యాయామానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయటం తల్లికి బిడ్డకు చాలా మంచిది.. దీనివల్ల కడుపులో ఉండే బిడ్డకు ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది.. అయితే మరీ కఠినమైన వ్యాయామాలు పెంచుకోకూడదు తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ కూడా అదుపులో ఉంటాయి.. అలాగే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ కూడా అదుపు చేయవచ్చు అంతే కాకుండా ఈ సమయంలో అధిక బరువు పెరగకుండా అదుపు చేయవచ్చు.. అలాగే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటివి చేయడం మంచిది.. అలాగే బోర్లా పడుకొని చేసే వ్యాయామాలు వెల్లకిలా పడుకొని చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి అలాగే టెన్నిస్, రన్నింగ్ ఇలాంటి వాటికు కచ్చితంగా దూరంగా ఉండాలి..
అలాగే ఉపదితులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు.. వ్యాయామాలు చేయకపోవడం మంచిది ముఖ్యంగా ఈ విషయంలో డాక్టర్ సలహా మాత్రం తీసుకోవడం తప్పనిసరి.. అలాగే ఈ సమయంలో వ్యాయామం చేసినప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. అంతేకాకుండా సరైన లోదస్తులు ఎంపిక కూడా అవసరం..