Etela Rajender Powerful Comments on CM KCR, BJP, TRS, Telangana Political News, Telangana Politics, Telugu World Now,
Telangana Political News: నన్ను ఓడగొట్టమని నా ప్రత్యర్థికి డబ్బులు పంపినా… నేను ఆ బాధను దిగమింగుకున్న.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కామెంట్స్: గతంలో ముఖ్యమంత్రి నన్ను కుడి భుజం. తమ్ముడు అని రైతు బందు పథకాన్ని ఇదే ప్రదేశం లో ఆవిష్కరించిన మాట వాస్తవం. 2018 ఎన్నికల్లో నా మీద ఒక వ్యక్తి తో వెయ్యి కోట్లు సంపాదించడని నా మీద పోస్టర్లు, కరపత్రాలు కొట్టిచ్చిండ్రు. నేను పదవుల్లో ఉన్ననాడు ఎవరి మీద కేసులు పెట్టియలేదు నా మీద కరపత్రాలు పంచిన వ్యక్తి వేరే వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తే వారు ఇచ్చిన ధరకాస్తు పై ఆ వ్యక్తి పై కేసులు నమోదయ్యాయి. ఆ కరపత్రాలు పంచిన వ్యక్తే నాకు కేసీఆర్ అఫీస్ నుండి చెప్తేనే నేను కరపత్రాలు పంచానని ఒప్పుకున్నాడు.
నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో చేసిన వాగ్దానం 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ లు, రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగిన. గత పద్దెనిమిది ఏళ్ళుగా నేను ఉద్యమంలో పాల్గొనలేదా, ఇప్పుడు నియోజక వర్గం లో తిరుగుతున్న మంత్రుల మీద ఉన్నాయా కేసులు నా మీద ఉన్నాయా ? ఉద్యమం లో పాల్గొని వెన్నంటే ఉన్న వాళ్ళను దూరం పెట్టిండు తిట్టినోల్లను దగ్గర పెట్టుకున్నాడు కేసీఆర్, ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎం జరిగిందో తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా, ఒక మంత్రి అంటున్నాడు చీమలు పెట్టిన పుట్టలో నేను చేరిన అని ఎవరు పెట్టిన పుట్టలో ఎవరు చెరారో ప్రజలందరికీ తెలుసు. నియోజక వర్గం లో బండ్ల మీద నా స్టిక్కర్ ఉన్నవాళ్లు నాతో పాటు ఉండే వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, నియోజక వర్గంలో బిజినెస్ నడువాలంటే టీఆర్ఎస్ పార్టీ లో ఉండాలని బెదిరిస్తున్నారు
డబ్బులు, కుల సంఘాల భవననాలు పెన్షన్ లు ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో ఆలోచన చేయండి. ఇవ్వన్నీ నా ద్వారా వస్తున్నందుకు గర్వపడుతున్నా, నా రాజీనామా వల్లే ఇవ్వన్నీ నియోజక వర్గానికి వస్తున్నాయి.