Entertainment నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీరిప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ మెహరీన్ కౌర్. తొలి సినిమాతోనే అందంతో అమాయకత్వంతో కట్టిపడేసిన.. ఈమె తర్వాత వరుస సినిమాలతో దూసుకు వెళ్ళింది… అయితే తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
హీరోయిన్ మెహరీన్ తాజాగా పలు సాహసాలు చేసుకుంటూ వెళ్తుంది వీటన్నిటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటుంది అయితే ఇవన్నీ చూసిన ఆమె అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అలాగే ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు..
తాజాగా మేహరీన్ అబుదబిలో చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.. అలాగే స్కై డైవ్ కు వెళ్లడానికి ముందు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నట్లు.. లైఫ్ లో మొదటిసారి ఇలా చేస్తున్నట్టు చెప్పకు వచ్చింది.. అలాగే అప్పుడు తనకు హార్ట్ బీట్ పెరిగినట్లు వివరించింది. స్కై డైవ్ కు తీసుకెళ్లే సిబ్బందితో కలిసి తేలికపాటి విమానంలోకి ఎక్కి.. వేల అడుగుల ఎత్తుకు చేరాక విమానంలో నుంచి కిందికి డైవ్ చేసింది. అలాగే గాల్లో తేలుతూ తన ఆనందాన్ని తెలిపింది అలాగే ఈ అనుభవాన్ని తన జీవితంలో మర్చిపోలేని అంటూ చెప్పుకొచ్చింది మెహరీన్.. అలాగే మొత్తం వీడియోను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.. వీడియోను చూసిన ఆమె అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.