Health Care : మన దేశంలో టీ అనేది ఒక డ్రింక్ కాదు, ఇదొక ఎమోషన్. టీ సువాసన చూస్తుంటేనే మనస్సు ఫిదా అయిపోతూ ఉంటుంది. ఉదయమైనా, సాయంత్రమైనా.. టీ తాగుతుంటే ఎంతో హాయిగా, యాక్టివ్‌గా ఉంటుంది. కొందమంది టీని నిద్ర మత్తు వదిలించే మెడిసిన్‌లా తీసుకుంటూ ఉంటారు, మరికొందరు శరీర బద్ధకం వదిలించి యాక్టివ్‌గా మార్చే ఎనర్జీ బూస్టర్‌గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి టీ తాగే స్పెషల్ స్టైల్ కచ్చితంగా ఉంటుంది. కొంతమంది టీ తోపాటు బిస్ట్కెట్ తింటూ ఉంటారు. ఈ కాంబినేషన్ చాలామంది ఇష్టపడతారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి హాని చేస్తుంది . టీతోపాటు బిస్కెట్లు తింటే.. అనేక వ్యధాలకు స్వాగతం పలికనట్లే అని అంటున్నారు. ఈ అలవాటు మీ మీ DNA ను కూడా దెబ్బతీస్తుంది.
డయాబెటిస్, మలబద్ధకం వచ్చే అవకాశం..
బిస్కెట్ తయారీకి చక్కెర ఎక్కువగా వాడుతుంటారు, టీలోనూ చక్కెర ఉంటుంది. చక్కెర అధికంగా తీసుకుంటే.. ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది ఇన్సులిన్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. మరోవైపు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియను పాడు చేస్తాయి. ఇది మలబద్ధకానికి దారితీయవచ్చు.
బీపీ పెరుగుతుంది..
టీతో పాటు బిస్కెట్లు తింటే.. బీపీ పెరుగతుందని, హైపర్‌టెన్షన్ సమస్య వచ్చే ముప్పు పెరుగుతుందని డైటీషియన్ మన్‌ప్రీత్ అన్నారు. బిస్కెట్లలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది హైపర్‌టెన్షన్ ముప్పు పెంచుతుంది. గుండె సమస్యలు, గుండె పోటు రావడానికి హైపర్‌టెన్షన్ ప్రధాన కారణం.
హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది..
బిస్కెట్లు ప్రాసెస్ చేసిన ఆహారం. ఇందులో DNA ను దెబ్బతిసే BHA, BHT ఉంటుంది. దీనిలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కూడా ఉంటుంది, ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతుకు దారితీస్తుంది.