విజయవాడ: శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జన్మదినోత్సవ వేడుకల్లో, అజాదీక అమృత మహోత్సవ సందర్భంగా శ్రీ అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరం లో ఆవిష్కరించనున్న ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతూ శ్రీ అల్లూరి సీతారామరాజు పై డా. ముకుంద శర్మ గీతం వ్రాయగా, డా. గజల్ శ్రీనివాస్ సంగీత సారథ్యంలో, స్వీయ గానం చేసిన ప్రత్యేక గీతాన్ని విజయవాడలో జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఆకుల వెంకట శేష శాయి మాట్లాడుతూ…. శ్రీ అల్లూరి జీవిత చరిత్ర దేశభక్తి స్ఫూర్తి కి పాఠ్యాంశం వంటిదని, ఆ చంద్ర తారార్కం వారి త్యాగాన్ని ప్రపంచం గుర్తు పెట్టుకుంటుదని అన్నారు.