Health ఆహారమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్లు అయితే మారిపోతున్న జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల ఆరోగ్యం మంత్రాలను పాటిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా రాత్రి తీసుకునే ఆహారం మాత్రం ఖచ్చితంగా శరీరంపై ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా ఈ సమయంలో తీసుకోకూడదని ఆహార నిపుణులు గట్టిగా చెప్తున్నారు. అయితే అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఉదయం మధ్యాహ్నం సమయంలో తీసుకునే ఆహారానికి రాత్రిపూట తీసుకునే ఆహారానికి కచ్చితంగా వ్యత్యాసం ఉండాలని తెలుస్తోంది రాత్రిపూట జీర్ణ క్రియ కొంచెం మందగిస్తుంది అందుకే ఎందుకు తగినట్టుగా కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ సమయంలో తీసుకోకపోవటమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ముఖ్యంగా వరి అన్నాన్ని రాత్రిపూట ఆహారంలో భాగం చేసుకోకపోవడం మంచిది దీని బదులుగా చపాతీలను మరి ఏదైనా ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే మరి రాత్రిపూట మరి అన్నం తీసుకోకుండా ఉండలేము అనుకునేవారు ఏడు ఎనిమిది గంటలకే రాత్రి భోజనాన్ని ముగించడం మంచిదని తెలుస్తోంది అలాగే రాత్రిపూట పెరుగును తీసుకోకూడదు.. అలాగే పాలు కూడా తీసుకోకూడదు పాల సంబంధిత పదార్థాలు అన్నీ కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీటిని రాత్రిపూట తీసుకోవడం వల్ల అజీర్ణం సమస్య వేధిస్తోంది దీని నుంచి దూరంగా ఉండటానికి వీటిని తీసుకోకపోవడం మంచిది.. అలాగే రాత్రిపూట మాంసాహార పదార్థాలను కూడా తీసుకోకూడదు. ఇది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రాత్రి తినేసి వెంటనే నిద్రపోతాం కాబట్టి మన ఆరోగ్యం పైన వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే రాత్రి సమయంలో తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలుస్తుంది..