Pan India Movie : మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ధ్రువ సర్జా పవర్ ఫుల్ పాత్ర పోషించడానికి ప్రాజెక్ట్ లోకి వచ్చారు.
శ్రీరామ నవమి సందర్భంగా ధ్రువ సర్జా ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ధృవ పొడవాటి, జుట్టు, గడ్డంతో మాస్ అప్పీల్ లో కనిపించారు. హనుమంతుని పేర్లలో ఒకటైన పవన్ పాత్ర అతని మెడలో రుద్రాక్ష మాలతో పరిచయం చేయబడింది, ఇది అతని పవర్ ఫుల్ నేచర్ ని ప్రజెంట్ చేస్తోంది.
అర్జున్ సర్జా తన విశిష్టమైన ఫిల్మ్ మేకింగ్ అనుభవంతో, కమర్షియల్ అంశాలతో కూడిన అద్భుతమైన కథను రూపొందించారు. ఈ చిత్రానికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయూబ్ ఖాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ జరుగుతోంది. ధ్రువ సర్జా షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు.
Cast : Aishwarya Arjun, Niranjan, Sathyaraj, Prakash Raj, Kovai Sarala, Arjun, and Dhruva Sarja
Technical Crew : Story, Direction: Arjun Sarja, Producer: Shree Raam Films International, Music: Anup Rubens, DOP: G Balamurugan, Editor: Ayoob Khan, Dialogues: Sai Madhav Burra, Lyrics: Chandra Bose, Kasarla Shyam, Fights: Babu, Choreography: Shrasti, PRO: Vamsi-Shekar