Devotional : సాధారణంగా మనిషి జీవితంలో ముఖ్యమైన వాటిలో నిద్ర కూడా ఒకటి. ప్రతి మనిషి కూడా తాను కష్టపడినంత సేపు కష్టపడి ఆ తర్వాత కోరుకునే విషయాల్లో ప్రధానమైనది మంచి నిద్ర. అలాగే డాక్టర్లు కూడా మంచి నిద్ర అనేది మనకు మంచి ఆరోగ్యకరమైన జీవితం ఉండేలా చూడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతూ ఉంటారు. అయితే మీరు చేసే కొన్ని చిన్న చిన్న పనులు మీ నిద్రకు ఆటంకం కలిగిస్తాయని తెలుసా. అవును… సనాతన కాలం నుంచి పండితులు, వాస్తు నిపుణులు వాస్తు గురించి పలు గ్రంధాల ద్వారా పలు విషయాలను పాటించాలని సూచిస్తున్నారు. కాగా వాస్తు ప్రకారం మన ఇంట్లో నిద్ర పోయేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అని సూచిస్తున్నారు. అలా ఆ వస్తువులు మనం నిద్రించే సమయంలో ఉంచుకోకూడదు అని సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
నిద్రపోయే సమయంలో కొంతమంది విద్యార్దులు చదువుకుంటూ పుస్తకాలను అలానే తల క్రింద పెట్టి పడుకోవడం మనం గమనించవచ్చు. అలా పుస్తకాలను తల కింద పెట్టుకోవడం వల్ల పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్రించే సమయంలో అద్దాన్ని తలకింద , ఎదురుగా పెట్టుకోకూడదు అని సూచిస్తున్నారు. అద్దాన్ని అలా తల కింద పెట్టుకోవడం వల్ల టెన్షన్స్ పెరిగిపోతాయని అంటున్నారు.
తలకింద బంగారు నగలను కూడా పెట్టకూడదు. దీని వలన కోపం పెరిగి పోతుంది. రిలేషన్ షిప్ లో ఇబ్బందులు వస్తాయి.
మీ వాలెట్ ని కూడా నిద్ర పోయేటప్పుడు తల కింద పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.