Devotional : మనిషి జీవితంలో డబ్బు అనేది ఎప్పుడూ ముఖ్య పాత్ర పోషిస్తూనే ఉంటుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించిన తర్వాత కూడా డబ్బు అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అందరికీ తెలిసిందే. మన అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు అవసరం. కానీ జీవితంలో ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకసారి అయిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన వస్తుంది. కష్టపడి పని చేసిన తర్వాత కూడా కొంచేతిలో డబ్బులను నిలుపుకోలేకపోతారు. ఇటువంటి అవరోధాలను అధిగమించేందుకే సులభమైన వాస్తు చిట్కాలు మీకోసం ప్రత్యేకంగా…
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి : పరిశుభ్రత లేని ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండదని చెబుతారు. ఇంట్లో మురికిని ఉంచడం ద్వారా లక్ష్మిదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మనిషి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటికి వేసే రంగులు : వాస్తు ప్రకారం ఇంటి గోడలకు సరైన రంగులు వేయడం చాలా ముఖ్యం. ఇంట్లో సరైన రంగులు ఉపయోగించక పోతే చాలా సార్లు ఆర్దిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు ప్రకారం గదికి తూర్పున తెలుపు, పశ్చిమాన నీలం, ఉత్తరాన ఆకుపచ్చ, దక్షిణాన ఎరుపు రంగు వేయాలని చెబుతున్నారు.
డబ్బు దాచుకునే దిశ : డబ్బు దాచుకునే అల్మారాను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. అందుకే ఖజానాను ఎప్పుడూ దక్షిణం వైపు ఉంచాలి. దాని తలుపు ఉత్తరం వైపు తెరవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతుష్టులై ఇంటికి సంపదలు చేకూరుతాయని నమ్మకం.