Devotional : భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ” భిన్నత్వంలో ఏకత్వం ” అని చెప్పాలి. మన దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులకు చెందిన వారు ఉన్నప్పటికీ అందరూ కలిసి జీవిస్తూ ఉండడం విశేషంగా పరిగణించాలి. కాగా హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగల్లో దీపావళి కూడా ఒకటి. ఈ పండుగను పురస్కరించుకొని దీపాలు వెలిగించి, కొత్త బట్టలు ధరించడం, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలవడం చేస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ ఏడాది దీపావళి పండగను అక్టోబరు 24న జరుపుకోనున్నారు. ఈ మేరకు ఆ రోజున ఇంటిని శుభ్రపరచాలి… ఎందుకంటే పరిశుభ్రమైన ఇల్లు లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మేరకు దీపావళి నాడు శుభ ముహూర్తం, పలు చిట్కాలు మీకోసం ప్రత్యేకంగా…
శుభ ముహూర్తం : సాయంత్రం 5.39 గంటలకు లక్ష్మీపూజ ప్రారంభం – సాయంత్రం 6.51 గంటలకు లక్ష్మీపూజ ముగింపు
దీపావళి నాడు చేయవలసిన ముఖ్యమైన పనులు :
ఇంటిని శుభ్రపరడం & అలంకరించడం : దీపావళికి శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఇల్లు, ఆఫీసు లేదా మీరు తరచుగా వెళ్లే ఏదైనా ఇతర ప్రదేశంలో సానుకూల శక్తి ప్రవహించేలా చేయడానికి అత్యంత ముఖ్యమైన కార్యకలాపం. ప్రతికూల శక్తిని తొలగించడానికి మీ ఇంటి ప్రతి మూలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీ వంటగది, స్టోర్ రూమ్ ని తగిన విధంగా శుభ్రం చేయాలి. అలాగే ఇంటిని లైట్లు, పువ్వులు, ముగ్గులు, తేలియాడే కొవ్వొత్తులు, గులాబీ రేకులు, ఇతర అలంకార వస్తువులతో అలంకరించండి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. అదే విధంగా లక్ష్మి దేవికి అందమైన ముగ్గులు సంతోషాన్ని ఇస్తాయని అంటారు. ఇంటి ముందు అందంగా ముగ్గులు వేయండి.
విరిగిన వస్తువులను పారవేయడం : వాస్తు ప్రకారం.. మీరు ఉపయోగించని, అద్దాలు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, బొమ్మలు, టపాకాయలు లేదా ఉపయోగంలో లేని అన్ని విరిగిన వస్తువులను వదిలించుకోవాలని పెద్దలు చెబుతారు.