Hari Hara Veera Mallu photo : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu) ఒకటి. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కథానాయిక. పీరియాడికల్ మూవీగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కరోనా ఎఫెక్ట్ తో పాటు పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో పవన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారంతే.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్. ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించిన పవన్ శనివారం.. చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తలతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి అంటూ పలు సినిమా ఇండస్ట్రీలలోని సెలబ్రెటీలతో కలిసి దిగిన ఫోటోలను ఓ వీడియో రూపంలో మొదటి పోస్ట్‌గా పంచుకున్నారు.
ఈ వీడియోలో హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్‌తో పాటు సినిమా షూటింగ్‌కు సంధించిన పలు ఫోటోలు ఉన్నాయి. అందులో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో హరిహర వీరమల్లు గెటప్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ ఫోటోను చిత్ర బృందం విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగు సినిమా పరిశ్రమలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. హరి హర వీరమల్లు టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు అంటూ హీరోయిన్ నిథి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ ను షేర్ చేస్తూ రాసుకొచ్చింది.