Nayak : ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ గురించి పెద్ధగా చెప్పనవసరం లేదు అయితే అది మొదలైనప్పటి నుంచి కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సందడే ఎక్కువుగా కనిపిస్తుంది. హిట్ సినిమా, ప్లాప్ సినిమా అని తేడా లేకుండా మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకు వచ్చి ఎంజాయ్ చేసేస్తున్నారు ప్రేక్షకులు. కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలు మాత్రమే కాదు తమిళ స్టార్స్ చిత్రాలకు అదిరిపోయే కలెక్షన్స్ అందిస్తూ తెలుగు ప్రేక్షకులు రీ రిలీజ్స్ ని ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్స్ మరికొన్ని సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యిపోతున్నారు.
ఈక్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘నాయక్’ని మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకు వచ్చేస్తున్నారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా నాయక్ ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు మరోసారి చరణ్ డ్యూయల్ రోల్ ధమాకా చూసేందుకు సిద్ధమవుతున్నారు. వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది.
ఈ సినిమాలోనే రామ్ చరణ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేశాడు. చెర్రీగా లవ్ అండ్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తూనే, సిద్దార్థ్ నాయక్ గా యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ తో విజుల్స్ వేయించాడు. ఇక చరణ్ కి జోడిగా కాజల్ అగర్వాల్, అమల పాల్ నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమాలోని ‘లైలా ఓ లైలా’ అప్పటిలో ఒక ఒపు ఊపింది. ఆ సాంగ్ కి రామ్ చరణ్ వేసిన స్టెప్పులు, అలాగే పాటలోని టి షర్ట్ బాగా ట్రెండ్ అయ్యాయి.