Dark circles: డార్క్ సర్కిల్స్.. చాలామందిని వేధించే సమస్య. పెద్దవారనే కాదు, చిన్నపిల్లలోనూ ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్, ఫోన్ చూడటం, టీవీ ఎక్కువగా చూడటం, కెఫిన్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం కారణంగా కంటి కింద వలయాలు వస్తాయి. డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖం అందవిహీనంగా మారుతుంది, కళ్లు అలసటగా కనిపిస్తాయి. చాలమంది వీటిని కవర్ చేయాడనికి మేకప్ వాడతూ ఉంటారు. అయితే, మనం తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాలు ఉండేట్లు జాగ్రత్తపడితే.. ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం మీకు మంచి నిద్రను ఇస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. వీటితో పాటు.. కోల్పోయిన పోషకాలను సమతుల్యం చేస్తుంది, మీ చర్మం సహజంగా మెరిసేలా చేస్తుంది.
విటమిన్ ఎ..
విటమిన్ ఎ లో యాంటీ ఏజింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది చర్మం స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ముడతలు, నల్లటి వలయాలు, చర్మ అలెర్జీలకు వ్యతిరేకంగా పోరాడటానికి తోడ్పడుతుంది. మీరు విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే.. డార్క్ సర్కిల్స్ సమస్య దూరం అవుతుంది. మీ డైట్‌లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటే క్యాప్సికమ్, మామిడి, బొప్పాయి, పాలకూర, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, గుమ్మడి పండు, జామ పండు, చీజ్ చేర్చుకోండి
విటమిన్ సి..
విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది రక్త నాళాలను మరింత బలపరుస్తుంది. ఇది కణాలలో రక్తం, ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ చర్మాన్ని సహజంగా మెరుపిస్తుంది. మీ డైట్ సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ఉసిరి, జామకాయలు, టమాటా, బెర్రీలు, ఆకుకూరలు చేర్చుకోండి.