Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. తన స్టైల్, యాక్టింగ్, డాన్స్, మ్యానరిజమ్స్ తో యూత్ కి ఐకాన్ గా మారి ఐకాన్ స్టార్ అనిపించుకుంటున్నాడు. ఈ హీరో ఆఫ్‌లైన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు ఆన్‌లైన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోయర్స్ తో అందుకున్న టాలీవుడ్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు. ఇటీవల థ్రెడ్స్ (Threads) అనే మరో సోషల్ ప్లాట్‌ఫార్మ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక థ్రెడ్స్ లో ఇండియన్ స్టార్స్ అంతా ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల అల్లు అర్జున్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే ఐకాన్ స్టార్ 1 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్నాడు. ఈ మార్క్ ని అందుకున్న మొదటి ఇండియన్ యాక్టర్ గా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. దీంతో సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు సందడి చేస్తున్నారు. ‘సోషల్ మీడియా కింగ్’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్.. వంటి స్టార్స్ ఎవరు ఇంకా థ్రెడ్స్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే థ్రెడ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి టాలీవుడ్ హీరో మాత్రం ఎన్టీఆర్.
ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్నాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో దర్శకుడు సుకుమార్ ఈ మూవీని మరింత గ్రాండ్ గా రెడీ చేస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ తదితరులు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.