Allu Arha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బన్నీకి అర్హ కంటే ముందు అయాన్ అనే కొడుకు ఉన్నపటికీ అర్హ తన చిలిపి అల్లరితో ఇటు అల్లు అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని ఆకట్టుకుంటూ వస్తుంది. అంతేకాదు స్కూల్ లో పాఠాలు కంటే ముందు సినిమా పాఠాలు నేర్చేసుకుంది. సమంత మెయిన్ లీడ్తో వచ్చిన శాకుంతలం సినిమాలో భరతుడు పాత్రలో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బడి పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తుంది.
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ‘ఫస్ట్ డే అఫ్ స్కూల్’ అంటూ ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. అందులో అర్హ తన అన్న అయాన్ చెయ్యి పట్టుకొని స్కూల్ లోకి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఫొటోలో అల్లు వారసులు ఇద్దరు వెనుక నుంచే కనిపిస్తున్నారు. ఇద్దరి స్కూల్ బ్యాగ్స్ పై వారి వారి పేర్లు ఉన్నాయి. ఇక ఈ పిక్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు భలే ముందుగా ఉంది అంటూ ఆ ఫోటోని రీ పోస్టులు చేస్తున్నారు. మరి ఒకసారి ఆ పిక్ ని మీరు కూడా చూసేయండి.
కాగా అర్హ మరో సినిమా ఛాన్స్ కూడా అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అది కూడా ఎన్టీఆర్ సినిమాలో అని తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ చిన్నప్పటి పాత్రలో అర్హని చూపించేందుకు మూవీ టీం అల్లు అర్జున్ ని సంప్రదించారట. బన్నీ కూడా ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి వీటిలో ఎంతవరకు నిజముందో తెలియదు.