Adipurush Movie : ప్రభాస్(Prabhas) రాముడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్ రిలీజ్ రోజు నుంచే దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. రామాయణాన్ని, అందులో పాత్రల స్వరూపాలని, డైలాగ్స్ ని ఇష్టమొచ్చినట్టు మార్చేసి రాయడంతో డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ లపై దేశవ్యాప్తంగా దారుణంగా ట్రోల్ చేశారు. సినిమా పూర్తిగా వివాదాలమయంగా నిలిచింది.
ఇక మొదటి మూడు రోజులు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని దిగినా సినిమా వివాదాల్లో నిలవడం, రామాయణం అని చెప్పి హాలీవుడ్ సినిమాలా మార్చి తీయడం, సినిమా కూడా చాలా మందికి నచ్చకపోవడంతో కలెక్షన్స్ కూడా రాలేదు. మొదటి మూడు రోజుల్లో 340 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా సినిమా రిలీజయి 15 రోజులు అవుతున్నా ఇంకా 500 కోట్ల కలెక్షన్స్ కూడా రాకపోవడం విశేషం. దీంతో చిత్రయూనిట్ నిరాశలో ఉంది.
తాజాగా ఆదిపురుష్ టీంకు మరో షాక్ తగిలింది. ఇటీవల కొత్తగా రిలీజయిన సినిమాలు నెలలోపే ఓటీటీలలో వస్తున్నాయి. ఇక అదే రోజు ఒరిజినల్ ప్రింట్ పైరసీ సైట్స్ లో వచ్చేస్తున్నాయి. అయితే ఆదిపురుష్ సినిమా ఓటీటీకి రాకముందే తమిళ్ వర్షన్ ఒరిజినల్ ప్రింట్ పైరసీలోకి వచ్చేసింది. మిగిలిన వెర్షన్స్ కూడా థియేటర్ ప్రింట్స్ పైరసీలోకి వచ్చేశాయి. దీంతో చిత్రయూనిట్ కి భారీ షాక్ తగిలింది. అసలే కలెక్షన్స్ రాలేదని బాధపడుతుంటే ఇలా ఒరిజినల్ ప్రింట్ లీక్ అవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మూవీ టీం. దీంతో ఆదిపురుష్ సినిమాని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారని సమాచారం.