healthHealth ఒక మనిషి డిప్రెషన్ లో ఉంటే చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటాడు ముఖ్యంగా ఇది మానసిక ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది కాబట్టి దాని నుంచి కోలుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు అయితే ఒక మనిషి డిప్రెషన్ లో ఉన్నారు అని చెప్పటానికి అతనిలో కచ్చితంగా కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా..
డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి ఏ విషయం పైన ఏకాగ్రత చూపలేకపోతాడు అలాగే ప్రతి విషయానికి ఆత్మను ఉన్నత భావాన్ని ఎదుర్కొంటాడు అలాగే ఏ నిర్ణయాన్ని సక్రమంగా తీసుకోలేడు కొన్నిసార్లు ఈ జీవితాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి…
అప్పటివరకు ఎంతో ఇష్టంగా చేసే పనులను సైతం పక్కన పెట్టేస్తూ ఉంటారు రోజు చేయవలసిన పనులను కూడా అజాగ్రత్త వహిస్తారు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉంటారు.. రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ పని పైన ఏకాగ్రత ఉండదు సరి కదా శరీరం పైన కూడా కొంచెం కూడా పట్టించుకోరు… ఒక మనిషి డిప్రెషన్ లో ఉన్నాడు అని చెప్పటానికి లక్షణాలు..
అయితే ఒక మనిషి ఆ డిప్రెషన్ నుంచి బయటపడాలి అనుకుంటే అది పెద్ద విషయం కాదని అంటున్నారు మానసిక నిపుణులు కానీ ఆ విషయాన్ని అంతే గట్టిగా ఆ మనిషి మైండ్లో ఫిక్స్ అవ్వాలని చెబుతున్నారు ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి తనకంటూ ఒక జ్ఞాపకాన్ని కల్పించుకోవాలి తనకు ఇష్టమైన పని చేయటము ఒక ఉద్యోగంలో చేరటము లేక ఇష్టమైన మనుషులతో మాట్లాడటం వంటివి చేయడం వల్ల తేలికగా డిప్రెషన్ నుండి బయటపడవచ్చు