Bhakthi వినాయక చవితి దేవి నవరాత్రులు అయిపోయాయి తొందరలోనే దీపావళి రాబోతుంది అయితే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించే ఈ రోజున ఆమె అనుగ్రహం పొందాలి అంటే దీపారాధన ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం..
దీపావళి రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది చీకట్లను తరిమికొట్టి వెలుతురును ఆహ్వానించే ఆ రోజున దీపాలను ఎలా వెలిగించాలి అంటే.. ఆ రోజున సాయంకాలం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈ విధంగా దీపారాధన చేయటం వలన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయని విశేష నమ్మకం అంతేకాకుండా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. దీపారాధనకు మట్టి దీపాలను ఉపయోగించి అందులో నేతిని పోసి దీపాలు వెలిగించాలని నమ్మకం… అలాగే నువ్వుల నూనెను వాడినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.. ఆవాల నూనెతో వెలిగిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట.
దీపావళి రోజున లక్ష్మీదేవి తో పాటు వినాయకుడిని కూడా పూజించడం సాంప్రదాయం.. అలాగే ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని పఠించడం వల్లే కనక వర్షం కురిసిందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ స్తోత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆరోజును ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలను వెలిగించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని తెలుస్తోంది.. ఇలా లక్ష్మీదేవిని స్తుతిస్తూ దీపారాధన చేయటం వల్ల ఆర్థికంగా ఉండే బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందాలు కలుగుతాయని నమ్మకం అంతేకాకుండా ఆర్థికంగా స్థిరవంతులవుతారని పురాణాలు చెబుతున్నాయి