Health డార్క్ చాక్లెట్ హెల్త్ కు చాలా మేలు చేసిందని చెబుతూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం.. పరిశోధనలు ఏమంటున్నాయి అంటే..
డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు అయితే దీనిని తినటం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలుస్తోంది క్రమం తప్పకుండా డాగ్ చాక్లెట్ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన జబ్బులనుంచి దూరంగా ఉండవచ్చు అని తెలుస్తోంది.. అలాగే ఏవైనా కొన్ని దుర అలవాట్లను మానాలి అనుకున్నప్పుడు ఒక డార్క్ చాక్లెట్ ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు..
సిగరెట్టు మానేయాలి అనుకునేవారు ఒక్కోసారి మళ్లీ తాగాలి అనిపిస్తుంది ఇలాంటి సమయంలో ఒక చిన్న డార్క్ చాక్లెట్ ను తీసుకోవడం వల్ల ఆలోచన నుంచి బయటపడవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి అలాగే ఒక్కొక్కరికి ఒక్క అలవాటు ఉంటుంది కొందరు ఫోన్లు దూరం పెట్టాలి అనుకున్న పెట్టలేరు ఇలాంటివారు కూడా డార్క్ చాక్లెట్ ను తరచూ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా మానసికంగా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని అధ్యయనాల్లో తేలింది.. అలాగే కొందరు కాఫీకి ఎక్కువగా అలవాటు అవుతూ ఉంటారు తరచూ కాఫీ తీసుకోకపోతే ఏమి తోచినట్టు ఉంటుంది ఇలాంటి వారు కూడా డార్క్ చాక్లెట్ ను అలవాటు చేసుకోవచ్చు.. కొన్ని దేశాల్లో ప్రజలు తరచూ డార్క్ చాక్లెట్ ని తీసుకుంటూ ఉండటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి తమను తాము రక్షించుకుంటున్నారని తాజా అధ్యయనాలు తెలిసాయి దీని వలన అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచవచ్చని తెలుస్తోంది.. అయితే డార్క్ చాక్లెట్ కింద చేదుగా ఉంటుంది దీని వలన దీన్ని తీసుకోవటానికి ఎవరు ఎక్కువగా ఇష్టపడరు..