పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం, శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకునే కార్యక్రమాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయల్ డేవిస్, ఐపీఎస్., మరియు ఎస్సీఎస్సీ ప్రతినిధులు రమేష్ ఖాజా, రాజేష్ సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్., మాట్లాడుతూ.. క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేసి పోలీస్ శాఖకు వన్నెతెచ్చే విధంగా విధులు నిర్వర్తించాలని ట్రాఫిక్ మార్షల్ కు సూచించారు.
అనంతరం జాయింట్ సిపి ట్రాఫిక్ డి. జోయల్ డేవిస్, ఐపీఎస్., ట్రాఫిక్ మార్షల్స్ ను అభినందిస్తూ వారికి తగిన భరోసాను కల్పించారు. ట్రాఫిక్ మార్షల్స్ కి కంపెనీల సహకారంతో తగిన వేతనం చెల్లించడం జరుగుతుంది. వారు ట్రాఫిక్ నియంత్రణ, పూర్తిస్థాయి విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. వారు ట్రాఫిక్ ఉల్లంఘనలపై తగిన విధంగా రిపోర్ట్ చేస్తారు.
ఈ కార్యక్రమంలో రహేజా మైండ్ స్పేస్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు శివకుమార్ వీరన్న, మాదాపూర్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి బాలాజీ, శంషాబాద్ ట్రాఫిక్ ఏసిపి పి. నాగభూషణం, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసిపి వెంకటయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ మార్షల్స్ తదితరులు పాల్గొన్నారు.