Cyberabad CP Steffen Ravindra IPS about Vinayaka Chaturthi Hyderabad Rules, Cyberabad News, Telangana News, Telugu World Now,
Cyberabad Police News: గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి: సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.
గణేష్ బందోబస్తుపై వివిధ శాఖల అధికారులతో సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం*గ ణేష్ పండుగను పురస్కరించుకొని గణేష్ బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతవరణంలో జరగాలన్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా గణేశ్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సైబరాబాద్ పరిధిలోని 36 చెరువుల వద్ద జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్లు సరిపడా క్రేన్ లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే లైట్లు, రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చూడాలన్నారు.భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయం తో పని చేయాలన్నారు.చెరువుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. హెల్త్ డెపార్ట్మెంట్ అప్రమత్థంగా ఉండాలన్నారు.
నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో, హైదరాబాద్ ఎం పోలీసులతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణిస్తామన్నారు. సీసీటీవీ ల పై దృష్టి సారించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
అన్ని చెరువుల వద్ద నీటి వసతి, హ్యాలోజెన్ లైట్లను ఏర్పాటు చేశామని, మొబైల్ టాయిలెట్ లను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు, సున్నం చెరువుల వద్ద 7 క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాడాలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామని అగ్నిమాపక శాఖ తెలిపారు.
ప్రగతి నగర్ చెరువు లో నీటి మట్టం తక్కువగా ఉండడంతో చిన్న విగ్రహాల మినహా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై దృష్టి సారించాలని భాగ్య నగర్ గణేశ్ ఉత్సవ సమితి వారు కోరారు. పెద్ద గణేశ్ విగ్రహాల ఐడీ ఎల్ చెరువులో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., రంగా రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావు, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అనుగు నరసింహాడ్డి, డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా,ఎస్ఓటీ డీసీపీ సందీప్, డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ ఎం సీ జోనల్ కమీషనర్ రవి కిరణ్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సెక్రెటరీ భగవంత్ రావు, వీహెచ్ పీ ప్రెసిడెంట్ రామరాజు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి, సమితి సభ్యులు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.